గీతంలో 5జి మరియు డ్రోన్ టెక్నాలజి వర్క్‌షాప్ ముగింపు
విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో “5జి మరియు డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై గత మూడు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ఈ వర్క్‌షాప్‌లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొని 5జి కమ్యూనికేషన్ మరియు డ్రోన్ సాంకేతికతలలో వస్తున్న మార్పులు, ఆచరణాత్మక ఉపయోగాలు, పరిశోధన అవకాశాలపై చర్చించారు. వర్క్‌షాప్‌లో ఐ.టి.డి.ఎమ్ కర్నూల్ ప్రొఫెసర్ డాక్టర్ పి. రవికిషోర్, డాక్టర్ ఎమ్.రవికుమార్ పాల్గొని తమ ప్రసంగాలలో వివిధ రంగాలలో డ్రోన్‌ల వినియోగం, నెట్‌వర్క్ కనెక్టివిటి, 5జి ప్రయోజనాలపై ప్రసంగాలు చేశారు. అటానమస్ నావిగేషన్, మిషన్ ప్లానింగ్ మరియు డ్రోన్ డిప్లాయిమెంట్ పై అవగాహన కలిగించారు. డాక్టర్ కె.కృష్ణనాయిక్ 5జి సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధనకు గల అవకాశాలు తెలియజేశారు. ఐఐటి ఖరగ్‌పూర్ చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జగదీష్ తన ప్రసంగంలో గాలిలోను, నీటి ఆధారిత వాతావరణంలోను డ్రోన్ వ్యవస్థల కనెక్టివిటీ ప్రాధాన్యతను వివరించారు. బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన డాక్టర్ రవిరాజ్ సక్షేణ 5జి అప్లికేషన్స్ అండ్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ పై ప్రసంగించగా డాక్టర్ అజిత్ కుమార్ ఇంటర్నెట్ ఆఫ్ డ్రోన్స్ పైన, డాక్టర్ సిమ్రన్‌జిత్ సింగ్ ఆప్టిక్స్ ఫర్ 5జి అండ్ బియాండ్ అనే అంశంపైన ప్రసంగించారు. వర్క్‌షాప్‌లో భాగంగా డాక్టర్ జె.ఎస్.వి.ఆర్.స్వరూప్‌కుమార్, డాక్టర్ కూనా వెంకటేశ్వరరావు ప్రాక్టికల్ శిక్షణ అంధించారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరక్టర్ డాక్టర్ కె.తిరుపతిరావు, సిఎసఇ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.వి.ఎస్.రాజ్‌కుమార్, డాక్టర్ కె.నవీన్‌కుమార్ తదితరులు పాల్గొని సర్టిఫికేట్‌లు అందించారు.