గౌతమి స్కూల్ అధినేత బొల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి
జగ్గయ్యపేట కమ్మ సంఘం మాజీ అధ్యక్షులు, గౌతమి స్కూల్ అధినేత బొల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు.
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో, ఎమ్మెల్యే శ్రీనివాసరావు కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ, సామాజిక సేవలో, విద్యారంగంలో శ్రీనివాసరావు చేస్తున్న కృషి అభినందనీయమని, ఆయన చేరిక పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ విధానాలు, ఎమ్మెల్యే నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎలమంచిలి రాఘవేంద్ర, పీఏసీఎస్ చైర్మన్ దులిపాల లక్ష్మణరావు తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ గుమ్మ వెంకటేష్ మాజీ కౌన్సిలర్ కటికల అనిల్ కుమార్ తెదేపా నాయకులు చిలుకూరి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ :శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా