గర్భిణీలకు కొండంత అండ.. సర్కారు వైద్య సేవలు * ప్రభుత్వ పథకాలతో మాతృత్వానికి భద్రత *
గరుగుబిల్లి, సూర్య : సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా గర్భిణీలకు వైద్య సేవలందించడం జరుగుతుందని గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్ర మంలో భాగంగా గర్భిణీలకు తనిఖీలు నిర్వహించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈసందర్భంగా గర్భిణీ లు తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్యాధి కారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ తగు సూచనలు సలహాలను అంద జేశారు.అనంతరం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ మాట్లాడు తూ గర్భిణీ నమోదు మొదలుకొని ప్రసవానంతరం వరకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు,పర్యవేక్షణ, హైరిస్క్ సమస్యల గుర్తింపుపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.కాన్పుకు, కాన్పుకు మధ్య నిర్ణీత సమయంతో తల్లి, బిడ్డకు కలిగే ప్రయోజనాలపై గ్రామ పంచాయతీ పరిధిలోని వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం అదే విధంగా వైద్యుల సూచనల మేరకు పోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం మరియు ప్రోటీన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ సూచించారు. గర్భిణీలు ప్రతిరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.ముఖ్యంగా సమతుల్య ఆహారం పండ్లు, కూర గాయలు ,తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ తిరుమలప్రసాద్ తెలిపారు. మలబద్ధకాన్ని నివారించేందుకు తగినన్ని మంచి నీళ్లు,పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. గర్భిణీల ఆరోగ్య శ్రేయస్సుకై వైద్య సిబ్బంది అంకిత భావంతో వైద్యసేవలు అందించాలని పేర్కొన్నారు.గర్భిణీల్లో రక్తహీనత,హైరిస్క్ సమస్యలు తలెత్త కుండా ఉండేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు.వైద్యాధికారి డాక్టర్ మరడాన చాందిని మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కార్డుల్లో ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షల వివరాలు పరిశీలించి నివేదికలు హెచ్చు,తగ్గులు గుర్తించి గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.గర్భిణీల్లో జ్వర లక్షణాలు గుర్తిస్తే హైరిస్క్ గా పరిగ ణించి సత్వరమే సమాచారం ఇవ్వాల న్నారు.డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువగా నీరు, ద్రవరూప ఆహారాన్ని తీసుకో వాలని గర్భిణీలకు సూచించా రు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధా రణ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గర్భిణీలు రక్తహీనత, హైరిస్క్ సమస్య లకు గురికాకుండా ఉండేలా అవసర మైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎన్ జగదీశ్వరి, చింతాడ ఉదయకుమారి, పొన్నగంటి శ్రీనివాసరావుతో పాటు ఏఎన్ఎం లు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.