ఏయు ఒప్పంద సహాయ ఆచార్యులకు ఈపీఎఫ్
విశాఖ ఎడ్యుకేషన్, మేజర్ న్యూస్ : హక్కుల సాధన కోసం సాగించిన సుదీర్ఘ పోరాటానికి, అకుంటిత దీక్షకు ఎట్టకేలకు విజయం లభించింది. దశాబ్దాలుగా సామాజిక, ఆరోగ్య ఉద్యోగ భద్రత లేక, చాలీచాలని జీతాలతోనే జీవితాలను వెళ్లదీస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ ఒప్పంద సహాయ ఆచార్యుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద సహాయ ఆచార్యులకు (కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ను ఆంధ్ర యూనివర్సిటి యాజమాన్యం అమలు చేసింది. పాతికేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను తన సమర్థవంతమైన నాయకత్వంతో ముగింపు పలికి, చట్టబద్ధమైన హక్కుగా సాధించటంలో డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి), డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వహించిన పాత్ర కిలకం,
సరిగ్గా భారత రాజ్యాంగ దినోత్సవానికి ముందు రోజైన 25 నవంబర్ 2025న రీజనల్ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ అమరదీప్ మిశ్రా ను డాక్టర్ సుబ్బయ్య కలసి ఒప్పంద అధ్యాపకుల సామాజిక అభద్రతను కష్టాలను అందిస్తున్న విశిష్ట సేవలను వివరిస్తూ మొదటిగా మెమోరాండాన్ని సమర్పించారు. అసోసియేషన్ ఫర్ డిగ్నిటీ చేసిన వరుస విజ్ఞప్తులకు స్పందించిన గౌరవ వైస్ ఛాన్సలర్ ఒప్పంద సహాయ ఆచార్యులకు ఈపీఎఫ్ అమలు చేస్తున్నామనీ అదేవిధంగా పరిశోధన ప్రాజెక్టులను కల్పిస్తున్నట్లు ప్రకటన చేయగా గ్యాలరీలో కూర్చున్న రెగ్యులర్ ఆచార్యులు,ఒప్పంద సహాయ ఆచార్యులు పరిశోధకులు విద్యార్థులు హర్షకేతనాలను తెలియజేశారు.
అధికారులు అందరకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.