BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఏపీ స్పెషల్ టెట్ కు హాజరవుతున్న ఉపాధ్యాయులకు భరోసా

Select Suryaa Now
ఏపీ స్పెషల్ టెట్ కు హాజరవుతున్న ఉపాధ్యాయులకు భరోసా

అధైర్యపడొద్దు, విజయం మీదే... అంటున్న పీఆర్టీయూ ఉత్తరాంధ్ర సమన్వయకర్త మడ్డు శ్రీను

ఎస్.రాయవరం, మేజర్ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆదివారం నుండి 21 వరకు నిర్వహిస్తున్న ఏపీ స్పెషల్ టెట్ కు హాజరవుతున్న ఉపాధ్యాయులందరికీ పీఆర్టీయూ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, విశాఖ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు మడ్డు శ్రీను భరోసా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యాశాఖ అభివృద్ధి కోసం అంకితభావంతో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులు, ఇప్పుడు మళ్లీ విద్యార్థులుగా మారి పరీక్షకు హాజరవుతుండటం సమాజానికి ఇచ్చే గొప్ప శుభసంకేతమని ఆయన కొనియాడారు. నమ్మకం ఉన్నచోట చీకట్లో కూడా వెలుగు కనిపిస్తుందని ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం నింపిన మడ్డు శ్రీను, ఎవరూ అధైర్యపడవద్దని, అందరూ తప్పక ఉత్తీర్ణత సాధిస్తారని ధైర్యం చెప్పారు.

ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయిడు కృషి అభినందనీయం!
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తనదైన శైలిలో కృషి చేస్తున్నారని పీ.ఆర్.టీ.యూ అధ్యక్షులు శ్రీను కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని మడ్డు శ్రీను ప్రశంసించారు.