BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

ఎన్టీఆర్ జిల్లాలో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

Select Suryaa Now
ఎన్టీఆర్ జిల్లాలో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల తొలి విడతలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నవంబర్ 22న వెల్లడించారు. జిల్లాలో మొత్తం 73 సర్పంచ్ స్థానాలకు గాను ఐదు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 68 స్థానాలకు 179 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు వెలగలేరు, గుడవల్లి, రామరాజ్య నగర్, కునపరాజుపర్వ, నాగులూరు. అలాగే 856 వార్డు సభ్యుల స్థానాలకు గాను 75 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 781 స్థానాలకు 1,662 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పూర్తిస్థాయిలో, మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలు:
జి.కొండూరు మండలం వెలగలేరు పంచాయతీ సర్పంచ్‌గా చిరుమామిళ్ల స్వప్న కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీలో ఐదు వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నేర్సు వెంకటేశ్వరమ్మతో పాటు మొత్తం 12 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమైంది. ఇదే మండలం కునపరాజుపర్వ పంచాయతీ సర్పంచ్‌గా పొనగంటి రాజ్యలక్ష్మి, మొత్తం 12 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ రూరల్ మండలం గుడవల్లి సర్పంచ్‌గా ఎన్. నీలమణేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా, 11 వార్డులకు గాను 1 నుంచి 10వ వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. రామరాజ్య నగర్ పంచాయతీ సర్పంచ్‌గా కొండా వెంకట రమణ, ఆరో వార్డు సభ్యురాలిగా కృష్ణవరపు సావిత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మండలాల వారీగా ఏకగ్రీవమైన వార్డు సభ్యుల వివరాలు:

జి.కొండూరు మండలం: గుర్రాజుపాలెం ఏడో వార్డు నుంచి వేముల భూలక్ష్మి, కోడూరు 11వ వార్డు నుంచి పాకలపాటి రజని, తెల్లదేవరపాడు మూడో వార్డు నుంచి చిలక సుధాకర్, నాలుగో వార్డు నుంచి గంగుల లావణ్య, ఐదో వార్డు నుంచి జెర్రిపోతుల సురేష్, ఏడో వార్డు నుంచి అఖిల లింగాల, వెలగలేరు ఎనిమిదో వార్డు నుంచి రాజవరపు రూప పద్మావతి, 13వ వార్డు నుంచి బొడ్డు శ్యామల రావు, 14వ వార్డు నుంచి మెండెం నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇబ్రహీంపట్నం మండలం: దాములూరు మొదటి వార్డు నుంచి యర్రగుంట్ల శివాజీ, రెండో వార్డు నుంచి ప్రతిపాటి ద్రౌపతి, చిలుకూరు ఐదో వార్డు నుంచి మొగులూరి పిచ్చమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మైలవరం మండలం: మైలవరం తొమ్మిదో వార్డు నుంచి శ్రీరామ్ నాగరాజు, పదో వార్డు నుంచి ఎం. సరళ, 15వ వార్డు నుంచి జి. లక్ష్మి, 16వ వార్డు నుంచి కె. రమాదేవి, 17వ వార్డు నుంచి ఎం. సునీత, 18వ వార్డు నుంచి ఎం. శివదుర్గ, 19వ వార్డు నుంచి జి. శ్రీలేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విజయవాడ రూరల్ మండలం: ఎనికేపాడు రెండో వార్డు నుంచి నరబోయిన ధనలక్ష్మి, నాలుగో వార్డు నుంచి కిలారు లిఖిత రాణి, 14వ వార్డు నుంచి కొడాలి వెంకట సుబ్బారావు, 16వ వార్డు నుంచి షేక్ నసీమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుడవల్లి మొదటి వార్డు నుంచి కిరపు కృష్ణ కుమారి, రెండో వార్డు నుంచి జొన్నలగడ్డ లక్ష్మీ పార్వతి, మూడో వార్డు నుంచి జుజ్జవరపు శ్రీనివాసరావు, నాలుగో వార్డు నుంచి జీతం శ్రీకాంత్, ఐదో వార్డు నుంచి ఇటికల జ్యోతి, ఆరో వార్డు నుంచి జుజ్జవరపు సునీత, ఏడో వార్డు నుంచి కొల్లిపర సుబ్బలక్ష్మి, ఎనిమిదో వార్డు నుంచి జొన్నలగడ్డ ప్రకాష్ రావు, తొమ్మిదో వార్డు నుంచి లోయ శ్రీనివాసరావు, పదో వార్డు నుంచి తేల నాగదుర్గ, 11వ వార్డు నుంచి జక్కంపూడి సొంగా పవన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రసాదంపాడు నాలుగో వార్డు నుంచి నూతి భవాని, ఐదో వార్డు నుంచి విద్య పాటిబండ్ల, ఆరో వార్డు నుంచి గుడవల్లి రవీంద్ర బాబు, ఎనిమిదో వార్డు నుంచి గూడపాటి శివదుర్గ, తొమ్మిదో వార్డు నుంచి సేతికం సుధారాణి, 11వ వార్డు నుంచి బొడ్డు మణి, 15వ వార్డు నుంచి తోట భాను ప్రకాష్, 16వ వార్డు నుంచి కొలకులూరి ఏసుపాదం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామరాజ్య నగర్ ఆరో వార్డు నుంచి కృష్ణవరపు సావిత్రి, రామవరప్పాడు తొమ్మిదో వార్డు నుంచి కరుమూరి మణిమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

రెడ్డిగూడెం మండలం: కునపరాజుపర్వ మొదటి వార్డు నుంచి చన్నెల్ల ముతారావు, రెండో వార్డు నుంచి చామకూర రత్నకుమారి, మూడో వార్డు నుంచి గుత్తి శిరీష, నాలుగో వార్డు నుంచి తోటకూర నాగమణి, ఐదో వార్డు నుంచి రాయుడు కృష్ణారావు, ఆరో వార్డు నుంచి ఆకుల శివపార్వతి, ఏడో వార్డు నుంచి తల్లూరి నాగమల్లేశ్వరి, పదో వార్డు నుంచి గురిజాల సురేష్ బాబు, 11వ వార్డు నుంచి పైటపాల జ్యోతి, 12వ వార్డు నుంచి గొల్లమండల కళ్యాణి, 13వ వార్డు నుంచి బత్తుల భూలక్ష్మి, 14వ వార్డు నుంచి వేముల కొండయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముచ్చినపల్లి మొదటి వార్డు నుంచి దేవళ్ళ ఆంజనేయులు, ఐదో వార్డు నుంచి బెల్లంకొండ రాజసులోచన, ఏడో వార్డు నుంచి మట్టా సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగులూరు మొదటి వార్డు నుంచి సయినా రత్నమాల, రెండో వార్డు నుంచి సింగళ్ళ శ్రీనివాసరావు, మూడో వార్డు నుంచి పిన్నిబోయిన వెంకట ఉషారాణి, నాలుగో వార్డు నుంచి బెజవాడ నాగజ్యోతి, ఐదో వార్డు నుంచి నేరుసు వెంకటేశ్వరరావు, ఆరో వార్డు నుంచి తన్నీరు ముసలయ్య, ఏడో వార్డు నుంచి ఉత్పల శ్రీనివాసరావు, ఎనిమిదో వార్డు నుంచి మట్టకొయ్య రాజేష్, తొమ్మిదో వార్డు నుంచి నందిపాము విజయ కుమారి, పదో వార్డు నుంచి వీర్ల తిరపతమ్మ, 11వ వార్డు నుంచి చందన భూక్యా, 12వ వార్డు నుంచి భూక్యా అరుణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరుకుళ్ళపాడు నాలుగో వార్డు నుంచి పల్లపు సుబ్బాయమ్మ, ఆరో వార్డు నుంచి గుంజి ఉమాదేవి, రుద్రవరం మూడో వార్డు నుంచి భీమిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, ఐదో వార్డు నుంచి యెరువ వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

మిగిలిన స్థానాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.