BREAKING
కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది: శ్రుతి హాసన్ ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..!

ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ భేటీ

Select Suryaa Now
ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ భేటీ

​ఎస్.కోట, సూర్య : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఆయన, నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి సమీకరణాలపై స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారితో విస్తృతంగా చర్చించారు. కార్యాలయానికి చేరుకున్న విజయ్‌కు ఎమ్మెల్యే, కూటమి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
​ఈ సందర్భంగా ఎస్.కోట నియోజకవర్గంలోని స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం, వార్డులు/పంచాయతీల వారీగా బలాల సమీకరణపై ఇరువురు నేతలు లోతుగా సమాలోచనలు జరిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య క్షేత్రస్థాయి సమన్వయం మరింత బలోపేతం కావడంపై ప్రధానంగా చర్చించారు. కూటమి నేతలు, కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ​రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట,  విజయనగరం జిల్లా.