ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్తగా జయమంగళ -- జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు
కైకలూరు, మేజర్ న్యూస్, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్తగా తనను నియమించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి, కూటమి లక్ష్యాల సాధనకు అంకితభావంతో కృషి చేస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పేర్కొన్నారు.
రిపోర్టర్ రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా