ఏలూరు గ్రామం వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు
పొదిలి, మేజర్ న్యూస్ ;
ప్రకాశం జిల్లా ఒంగోలులో తలపెట్టిన మహాధర్నాకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు సీఐ రాజేష్ కుమార్, ఎస్ఐ సూరెడ్డి రాజేష్ లఆధ్వర్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగానే ఒంగోలు వెళ్లే మార్గంలో ఉన్న ఏలూరు గ్రామం వద్ద ప్రత్యేకంగా చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం గుండా ఒంగోలు వైపు వెళ్తున్న వాహనాలను, ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.ధర్నాకు అనుమతి లేనందున ఎవరూ నిబంధనలను ఉల్లంఘించి ముందుకు వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, అనధికారిక ఆందోళనల్లో పాల్గొని ఇబ్బందుల్లో పడవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.