ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు
పలమనేరు మేజర్ న్యూస్
నియోజకవర్గ పరిధిలో ని వీకోట మండలంలో కృష్ణాపురం, తోటకణము, ఎన్ కొత్తూరు, పలాస మంద, వి కోట నందు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు జరిపి కృష్ణాపురం క్రాస్ వద్ద హరిబాబు అనే వ్యక్తి వద్ద 20 పెట్రా ప్యాకెట్లను ఒరిజినల్ ఛాయిస్ డైలాగ్స్ విస్కీ సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్ కుమార్, ఎస్ఐలు మస్తాన్ వల్లి, సునీల్ కుమార్, ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది. ఇస్మాయిల్, రాజేష్, ఢిల్లీ బాబు, వెంకటేష్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల సందర్భంగా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్, షాపులను మూసివేసి సీల్ వేయడం జరిగిందని తెలిపారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 1వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు మూడవ తేదీ కౌంటింగ్ రోజు కూడా మద్యం దుకాణాలు బార్ కూడా మూసివేయడం జరుగుతుందన్నారు. మద్యం దుకాణ యజమానులకు ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి తెలియజేశారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్