పలమనేరు అభివృద్ధే లక్ష్యంగా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ప్రచారం 21, 22, 23, 24వ వార్డుల్లో విస్తృత పర్యటన.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన
పలమనేరు మేజర్ న్యూస్:
పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ప్రచార వేగాన్ని పెంచారు. పట్టణంలోని 21, 22, 23, 24వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, వార్డుల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలమనేరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపుతానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయడమే తన ఉద్దేశమని వివరించారు.ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు.