BREAKING
సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!.... ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు.... లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు భక్తి భావంతో ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాల వితరణ.... అనంతపురం జిల్లాలో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై దుండగుల దాడి ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు  మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి* మద్దికుంటలో నీటి సంరక్షణే ధ్యేయంగా 'జలసరి' కార్యక్రమం ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై నటి సునయన తీవ్ర ఆవేదన. దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు శ్లాఘనీయం.. ఎమ్మెల్యే పాయం

దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు శ్లాఘనీయం.. ఎమ్మెల్యే పాయం

Select Suryaa Now
దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు శ్లాఘనీయం.. ఎమ్మెల్యే పాయం

మణుగూరు ఆర్ సి సూర్య ; భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ  ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు  ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను, దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. భారతదేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ,దేశ ఐక్యత,సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పేదలు, రైతులు,కార్మికులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు.దేశ ప్రజల సంక్షేమం,సామాజిక సమానత్వం, ఆర్థిక అభివృద్ధికి ఆమె చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.దేశం కోసం అంకితభావంతో పనిచేసి, భారతదేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ఇందిరాగాంధీ త్యాగం, సేవా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.ఆమె ఆశయాలు, ఆదర్శాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యతనివ్వాలని, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా