BREAKING
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. గొంతు కోసిన దుండగుడు జీవా 'తగప్పన్' సినిమా నుండి 'తంగపుళ్ళ' ఫస్ట్ సింగిల్ విడుదల! మోహన్‌లాల్ 'అతిమనోహరం' సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ! యలహంక ఆస్తి వివాదంపై షర్మిల సంచలన పోస్ట్: కూతురి పెళ్లి వేదిక మార్పు! జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి దుర్మరణం సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!.... ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు.... లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు భక్తి భావంతో ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాల వితరణ.... అనంతపురం జిల్లాలో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై దుండగుల దాడి ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు 

సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

Select Suryaa Now
సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

సూర్య రాజన్న సిరిసిల్ల..సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.పటేల్ ఆలోచనలు, ఆశయాలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.ప్రతి ఒక్కరూ భారతీయులమనే భావనతో ఐకమత్యంగా ఉండాలని, జాతి ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయడమే సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అర్పించే నిజమైన నివాళి అని ఎస్పీ గారు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, ఆర్.ఐ లు సురేష్, రమేష్ సిఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మధుకర్, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.