మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు
సూర్య ఎల్లారెడ్డిపేట ..ప్రజా రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల బాధ్యత అని నిరూపించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు.ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై శనివారం ఉదయం ఓ మహిళ అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తున్న బ్లూకోట్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలు ఈ విషయాన్ని గమనించారు.వెంటనే స్పందించిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహిళ వద్దకు చేరుకుని మానవతా దృక్పథంతో ప్రథమ చికిత్స అందిస్తూ, ఆమె చేతులు, కాళ్లు రుద్దడంతో కొద్దిసేపటికే ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్నప్పటికీ తోటి మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే స్పందించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిల లను ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు అభినందిస్తున్నారు.