గుంటూరు: నిద్రిస్తున్న తల్లివద్ద నుండి 2నెలల పసికందు అపహరణ.. కలకలం రేపిన ఘటన
గుంటూరు నగరంలో రెండు నెలల పసికందు అపహరణ ఘటన కలకలం రేపింది. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాత సామాను సేకరించే దుకాణం ముందు తల్లితో కలిసి నిద్రిస్తున్న రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు సీసీ కెమెరాల వీడియోలో కనిపిస్తోంది.ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.రెండు నెలల పసికందు అపహరణ ఘటన గుంటూరు నగరంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.