ఈశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం
- పీడిక రాజన్న దొర
పాచిపెంట: వైయస్సార్ పార్టీ భూత్ లెవెల్ ఏజెంట్ బొబ్బిలి ఈశ్వరరావు కుటుంబ సభ్యు లను సోమవారం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.సోమవారం నాడు పాచిపెంటలో ఈశ్వరరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. మంచి కార్యకర్తను కోల్పోయామని బాధపడ్డారు. మృతుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని తెలిపారు. ఈశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. జిల్లా వైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి కూడా ఈశ్వరావు మృతిపట్ల ఆవేదన చెందారు. టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, పలువురు కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.