ఏడు గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు విజయం
మండలంలో ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు గెలుపు.
పెద్ద ఉల్లగల్లులో రీపోలింగ్.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
మండలంలో 14 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచులు గా 6 పంచాయితీలు, జనసేన పార్టీ సర్పంచిగా ఒకచోట, టిడిపి రెబల్ సర్పంచిగా పోలవరంలో ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సిపి సర్పంచులుగా ఐదు పంచాయతీలు ఎన్నికయ్యారు. మండలంలోని కెల్లంపల్లి సర్పంచ్ పదవికి టిడిపి మద్దతుతో పోటీ చేసిన మోతుకూరి నాగమల్లేశ్వరి సమీప వైసీపీ అభ్యర్థి పాలెపోగు నిర్మలపై 1634 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శంకరాపురం సర్పంచ్ పదవికి పోటీ చేసిన టిడిపి మద్దతు అభ్యర్థి మందలపు పూర్ణచంద్రరావు సమీప వైసీపీ అభ్యర్థి మేడికొండ శేషగిరిరావుపై 225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నూజల్లపల్లి సర్పంచ్ పదవికి పోటీ చేసిన జనసేన అభ్యర్థి కిలారి లక్ష్మి సమీప వైసీపీ అభ్యర్థి బరిగే నారాయణ పై 507 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పూరిమెట్ల సర్పంచ్ పదవికి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి నిడిగంటి నారాయణ సమీప వైసీపీ అభ్యర్థి రమణాల నాగేశ్వరరావు పై 32 ఓట్ల మెజార్టీతో,
పోలవరం నుండి సర్పంచ్ పదవికి పోటీ చేసిన టిడిపి రెబల్ అభ్యర్థి పరుచూరి శిరీష తమ సమీప అభ్యర్థి కొర్రపాటి సునీతపై 29 ఓట్ల మెజార్టీతో, తూర్పు కంభంపాడు సర్పంచ్ పదవికి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి బుల్లము సుబ్బరత్తమ్మ సమీప వైసీపీ అభ్యర్థి గంగిశెట్టి భూలక్ష్మి పై 134 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పసుపుగల్లు పంచాయతీ లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి బిజ్జం జ్యోతి పై టిడిపి అభ్యర్థి గుడాల అమల 360 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మారెళ్ళలో టిడిపి అభ్యర్థి ఓరుసు అంజమ్మ పై వైయస్సార్సీపీ అభ్యర్థి షేక్ అల్లాబి 282 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేముల పంచాయతీలో టిడిపి అభ్యర్థి రావులపల్లి కోటేశ్వరమ్మ పై వైయస్సార్సీపి అభ్యర్థి బైలడుగు నాగజ్యోతి 437 ఓట్లు మెజార్టీతో, నాయుడుపాలెం పంచాయతీలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి తాతపూడి దావీదు రాజు 450 కోట్ల మెజార్టీతో గెలుపొందారు. నాయుడుపాలెం పంచాయతీలో 12 వార్డులకు, 11 వార్డుల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందారు. బృందావనంలో టిడిపి అభ్యర్థి బాలు నాయక్ పై వైయస్సార్సీపి అభ్యర్థి రాజు నాయక్ 181 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. జమ్మలమడక పంచాయతీలో టిడిపి అభ్యర్థి కొర్నిపాటి కోటయ్యపై వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎడ్లపల్లి నాగయ్య 37 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు సంబరాలు చేసుకున్నారు.