BREAKING
ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక!

దుర్భరం అశ్వినీపురం గిరిజనవాసం - నిధులు రాక నిర్మాణాలు సాగక గుడిసెలకే పరిమితం

Select Suryaa Now
దుర్భరం అశ్వినీపురం గిరిజనవాసం - నిధులు రాక నిర్మాణాలు సాగక గుడిసెలకే పరిమితం

ఆత్మకూరు, మేజర్ న్యూస్:   రోడ్డుకు దూరంగా పొలాల్లో నివాసాలు ఏర్పరచుకున్న గిరిజనులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాటాకు పూరి గుడిసెలకే పరిమితమై నివాసాలు ఉంటూ దుర్భర పరిస్థితి తో కొనసాగుతున్న వైనమిది.ఆత్మకూరు మండలం నువ్వురుపాడు మజరా అశ్వినిపురం సమీపంలోని పొలాల మధ్య జీవనం సాగిస్తున్న గిరిజనులు పలువురు దశాబ్ద కాలంగా పక్కా గృహాలకు నోచుకోవడం లేదు. గతంలో పొలాల మధ్య తాటాకు పూరి గుడిసెలు నిర్మించుకున్న గిరిజన్లో 12 మందికి ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయగా నిర్మించుకున్నారు.మిగతా 15 మందికి 10 ఏళ్ల క్రితం పక్క గృహాలు మంజూరు కాగా ఆ గిరిజనులు ఉన్న ఇళ్ళను తొలగించి పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభించి ఆ ప్రక్కనే పూరి గుడిసెలు నిర్మించుకొని నివాసాలు ఉండసాగారు. తీరా చూస్తే వారికి బిల్లులు మంజూరు కాలేదు. దాంతో ఇండ్ల నిర్మాణ పనులను నిలిచిపోయాయి. ఇక ఆ విషయం గురించి ఎందరికి మొరపెట్టుకున్న ఎవరూ పట్టించుకోనందున వారికి సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేక కూలీనాలి పనుల ద్వారా జీవనం సాగిస్తూ తాటాకు పూరి గుడిసె నివాసాలకే పరిమితమయ్యారు. గిరిజనులకు ఎన్నెన్నో పథకాలు అంటున్న ప్రభుత్వాలు వారు అనాదిగా రహదారులు, సైడ్ కాలువలు తాగునీటి వసతి లేకుండా నానా అవస్థలు పడుతుండగా రెండేళ్ల క్రితం సిమెంట్ రోడ్లు నిర్మించారు. త్రాగు నీరు అందిస్తున్నారు. సైడ్ కాలువలు మాత్రం నిర్మించలేదు. కాగా రెండు కుటుంబాల వారు పక్కా గృహ నిర్మాణ పనులు నిలిచిపోగా పక్కనే పూరి గుడిసెలు నిర్మించుకొని నివాస ఉంటుండగా మూడేళ్ల క్రితం ఆ గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సాయం అందించకపోగా కనీసం వారికైనా పక్కా గృహాలు మంజూరు చేయలేదని వారు ఆవేదంతో తెలిపారు. తమకు గతంలో నిలిచిపోయిన గృహాల బిల్లులు చెల్లించి వాటిని పూర్తిచేసుకునే అవకాశం కల్పించాలని, ఇంకా అవసరమైన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని పదే పదే ఏళ్ల తరబడి విలేకరులకు విన్నవించినా,అధికారులకు ప్రజాప్రతిలకు నాయకులకు మొరపెట్టుకుంటున్న ఏమాత్రం ఫలితం లేకపోతుందని వారు తీవ్ర ఆవేదనతో తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాములు ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలకు సంబంధించి బకాయిలు విడుదల కాలేదని చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం  రాష్ట్ర విభజనతో గృహ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ఆన్లైన్ ఖాతాలు ఏర్పడినందున బిల్లులు చెల్లింపు నిలిచిపోయిందని అప్పట్లో అధికారులు చెబుతుండేవారు. అప్పట్లో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గం లో 19239 గృహాలు పూర్తికాగా 3818 గృహాలు వివిధ దశల్లో ఉండేవి.9242 మంది గృహాల నిర్మాణం ప్రారంభించలేదని తెలిపారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగా వివిధ కారణాలతో మూడేళ్ల తర్వాత గృహ నిర్మాణ కార్యక్రమం ఆరంభమైంది. అప్పటికే ఆత్మకూరు మండలంలో 150 గృహాల నిర్మాణాలు నిలిచిపోగా దాదాపు 50 లక్షల రూపాయలు బకాయిలు ఉండేవి. అశ్వనీపురం గిరిజన కాలనీలో 14 ఇళ్ళు నిర్మాణం నిలిచిపోయి ఈనాటికి పునాదులకే పరిమితమై కనిపిస్తున్నాయి. వారికి బిల్లులు చెల్లించనందున నిర్మాణం కొనసాగించలేక పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నామని   వారు వాపోతున్నారు.తాము నిరుపేదలం కావడంతో సొంతంగా గృహాలను నిర్మించుకో లేకున్నామని వారు చెబుతుంటారు. గతంలో గృహ నిర్మాణాలు పూర్తిచేసిన పలువురికి తుది బిల్లు కూడా రాలేదని నియోజకవర్గంలోని ఆరు మండలంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అప్పట్లో అధికారులు తెలిపారు. ఏళ్లు గడిచిపోతున్న ఆ బకాయిల గురించి ఎవరూ పట్టించుకోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా నానా అవస్థలు పడుతున్న గిరిజనుల గృహ నిర్మాణం బిల్లులు చెల్లించాలని లేదా కొత్త ఇల్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.