దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా.రాజానగరం మేజర్ న్యూస్, రాజానగరం మండలం దివాన్ చెరువు జంక్షన్ వద్ద మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
గ్రామానికి చెందిన పలివెల స్వామి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి శ్రీనివాసరావు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్గాని శ్రీనివాసరావు, పలివెల స్వామి, గంగిశెట్టి సోమేశ్వరరావు, మందారపు వీర్రాజుతో పాటు దివాన్ చెరువు ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.