ధర్మ తేజ ను మర్యాదపూర్వకంగా కలిసిన, మున్సిపల్ చైర్ పర్సన్.
కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా అఖండ విజయం సాధించిన బుట్నా లక్ష్మీ తిమ్మరాజు టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పార్టీ నాయకులను కలుస్తూ ఆత్మీయంగా పలకరిస్తున్న క్రమంలో ఈ భేటీ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా దేవినేని ధర్మతేజ నూతన చైర్మన్ బుట్నా లక్ష్మీ తిమ్మరాజును అభినందించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో సాధించిన విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్న బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాననే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నూతన చైర్మన్ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న ఈ మర్యాదపూర్వక భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.