andhrapradesh
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి:రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం కూటమి బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం కూటమి పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి మరియు సుపరిపాలనకు పట్టణ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను కైవసం చేసుకునేలా శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో సీట్లు లభించని నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వారందరికీ రాబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.