telangana
హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరల పరుగు
హైదరాబాద్:హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా పసిడి ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెరిగిన ధరల ప్రకారం, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములపై రూ.270 పెరిగి రూ.1,39,910 కి చేరగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.250 పెరిగి రూ.1,28,250 వద్ద నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతుండటంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కును తాకింది. పసిడి, వెండి ధరల్లో నిరంతరం హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మార్కెట్ ట్రెండ్స్‌ను తీవ్ర ఆసక్తితో గమనిస్తున్నారు.