BREAKING
అద్భుతమైన క్యాచ్‌తో మెరిసిన విరాట్ కోహ్లీ.. గాల్లోకి డైవ్ చేస్తూ నాథన్ స్మిత్ ఔట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. సినిమా రెడీ అయినా సరే టైటిల్ మార్చాల్సిందే ఎందుకంటే? “నేను పోటీలో లేను కాబట్టే ఓటమి” ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. పశుగ్రాసం పెంపుపై రైతులు దృష్టి సారించాలి: ఎంపీడీవో సంపత్ కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం. సెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం యూజీసీ-నెట్‌లో 99.44 పర్సంటైల్‌తో జేఆర్‌ఎఫ్‌ సాధన.. బీబీపేట PACS కు స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ ప్రజలు నాగార్జున సినిమాలు పాన్ ఇండియానా? సూర్య కామెంట్స్‌పై నెటిజన్ల ట్రోల్స్ నీటి విలువ తెలుసుకోండి.. వేసవి నీటి ఎద్దడిని నివారించండి: ఎంపీడీవో శాంత గుంటూరు:- ఆ మూడు మండలాలలో ఎన్నికలకు బ్రేక్!!- స్పందించిన కలెక్టర్ కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న హతః సినిమా విడుదల వాయిదా.. అసలు కారణం ఇదే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మెటీరియల్ పంపిణీ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం 15 కిలోలు తగ్గిన తారక్.. ఆ మేకోవర్ వెనుక అసలు కారణం ఇదే కింగ్ 100 మూవీ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో నటి కొత్త అవతారంలో అలరించనున్న స్టార్ హీరోయిన్ నిత్యా మోనన్.. విలన్‌గా ఎంట్రీ?

హృదయ విదారక సన్నివేశం..*స్మశాన వాటికకు పోటెత్తిన దొంతికుంట వరద.. రెండు శవాలకు అంత్యక్రియలకు అడ్డంకి*

Select Suryaa Now
హృదయ విదారక సన్నివేశం..*స్మశాన వాటికకు పోటెత్తిన దొంతికుంట వరద.. రెండు శవాలకు అంత్యక్రియలకు అడ్డంకి*

సూర్యఅశ్వారావుపేట,అశ్వారావుపేటలో కురుస్తున్న భారీ వర్షం హృదయ విదారక సన్నివేశానికి కారణమైంది. దొంతికుంట వరద నీరు ఉధృతంగా ప్రవహించి స్మశాన వాటికను ముంచెత్తడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

చనిపోయిన తమ వారికి చివరి వీడ్కోలు పలకడానికి వచ్చిన రెండు కుటుంబాలు నిస్సహాయంగా నిలబడిపోయాయి. రెండు శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికలోకి వెళ్లే దారి పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో అంత్యక్రియలకు అడ్డంకి ఏర్పడింది.

గంటల తరబడి వర్షంలోనే బంధువులు, గ్రామస్తులు,అనాధ ఆశ్రమంలో మరణించిన వృద్ధుడు  శవాలతో స్మశానం వద్ద వేచి చూస్తూ ఉండిపోయారు. వరద తగ్గుతుందేమోనని ఎదురుచూసినా వర్షం తగ్గకపోవడంతో వర్షం లోనే అంత్యక్రియలు నిర్వహించారు. .

చివరకు గ్రామ పెద్దలు, స్థానికుల సహాయంతో ఎంతో కష్టం మీద, మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట