కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న హతః సినిమా విడుదల వాయిదా.. అసలు కారణం ఇదే
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కుతున్న తాజా మిస్టికల్ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించి మేకర్స్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. కేఏ ప్రొడక్షన్స్ మరియు పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి శివశంకర నాయుడు. వై నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటానికి సరైన కారణాలను దర్శకుడు మరియు నిర్మాతలు స్పష్టం చేశారు. ఏ ప్రాంతం వారైనా ఈ సినిమాను చూస్తే అది తమ చుట్టూనే జరుగుతుందనే అనుభూతి కలిగించేలా ఈ అరుదైన మిస్టికల్ థ్రిల్లర్‌ను రూపొందించామని దర్శకుడు అనుష్ గోరక్ తెలిపారు. సినిమాలో ఉన్న అద్భుతమైన విజువల్స్ మరియు నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లలో మాత్రమే అనుభవించాలనే ఉద్దేశంతోనే విడుదల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కథలో అనేక ఆసక్తికరమైన రహస్యాలు ఉన్నాయని, వాటిని పెద్ద స్క్రీన్‌పై చూసినప్పుడే అసలైన థ్రిల్ లభిస్తుందని యూనిట్ సభ్యులు వెల్లడించారు.
సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తి కావోస్తున్న తరుణంలో, సరైన సమయంలో సరికొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రానికి నిర్మాణ పరంగా ఎంతో సపోర్ట్ చేస్తూ, కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొనడంతో, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు ప్రకటIస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిస్టికల్ హారర్ అంశాలతో సాగే ఈ కథ ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టి అలరిస్తుందనేది త్వరలోనే తేలనుంది.
మరోవైపు కిరణ్ అబ్బవరం స్వయంగా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రియాలిటీ సినిమా కూడా డిసెంబర్ 25న విడుదల కానుండటంతో ఆయన లైనప్‌లోని సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం నిర్మాణ రంగంలోనూ తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హతః సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీతో పాటు త్వరలోనే మరిన్ని ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read: ఎన్టీఆర్ డ్రాగన్ కోసం 15 కిలోలు తగ్గిన తారక్.. ఆ మేకోవర్ వెనుక అసలు కారణం ఇదే