దల్లిపేట సర్పంచ్ అభ్యర్థిగా దల్లి రామగోవింద్
భోగాపురం, సూర్య : భోగాపురం మండలం దల్లిపేట పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై రాజకీయ కసరత్తు కొలిక్కి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా దల్లి రామగోవింద్‌ను బలపరుస్తూ పంచాయతీ పరిధిలోని గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దల్లిపేట పంచాయతీలో నిర్వహించిన సమావేశంలో ముగడపేట, దుక్కపేట, గాలిపేట, కొయ్యావానికల్లాలు, బొల్లింకలపాలెం, రాళ్లపాలెం, దల్లిపేట గ్రామాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున దల్లి రామగోవింద్‌ను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా బలపరచాలని నిర్ణయించారు. దీంతో దల్లిపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రామగోవింద్ పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.