BREAKING
గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు... మధుర నగర్ వెంచర్ ప్లాట్ల వివాదం.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు హాలియా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నంద్యాల వేణు నియామకం మీదివేములలో టీడీపీ ముమ్మర ప్రచారం విరువూరు, పాపన్నగారిపల్లిలో కూటమి ప్రచార సందడి! సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష.. -- అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యం -- నారాయణపేటలో పోలీసుల ఫ్లాష్ వాక్ – బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి -- నారాయణపేట ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ప్రజాదరణతో ముందుకెళ్తున్న ఎన్డీయే కూటమి బ్రహ్మాసముద్రం లో వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం జోరు. అభివృద్ధిని చూడండి శ్రీనివాసవర్మను గెలిపించండి

దగదర్తి మండలాన్ని 'అభివృద్ధికి అడ్డాగా' మారుస్తాం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

Select Suryaa Now
దగదర్తి మండలాన్ని 'అభివృద్ధికి అడ్డాగా' మారుస్తాం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

​దగదర్తి, వెలుపోడు, మేజర్ న్యూస్ :   దగదర్తి మండలం, వెలుపోడు గ్రామంలో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన  ప్రచార సభలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ... జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాందా శీనయ్యను, ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దెల పద్మను సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.వెలుపోడు ఎంపీటీసీ పరిధిలోని ప్రతీ ఒక్క సమస్యను గుర్తించి, వాటిని త్వరితగతిన తీర్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు.

​రైతులకు భూ హక్కులు :  వెలుపోడు పంచాయతీ పరిధిలో అనేక సంవత్సరాలుగా భూమి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు త్వరలోనే భూ హక్కులను కల్పిస్తామని, ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

​అభివృద్ధికి అడ్డాగా దగదర్తి :  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో దగదర్తి మండలాన్ని 'అభివృద్ధికి అడ్డాగా' నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.