డాక్టర్ వి. శైలజకు ప్రతిష్ఠాత్మక 'రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు – 2026'.
కావలి, మేజర్ న్యూస్ : కావలిలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. శైలజకు ప్రతిష్ఠాత్మకమైన 'రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు – 2026' లభించింది.
సిడ్వి సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (SSRD) మరియు సిడ్వి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ అంతర్జాతీయ సదస్సు (ICMIRTM-2026) మరియు ‘ఏక్తా-2026’ పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 30, 31 తేదీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బోధన, పరిశోధనా రంగాల్లో డాక్టర్ శైలజ కనబరుస్తున్న ప్రతిభ, అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యావేత్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.