చిన్నరాజుపేటలో శూలముల మహోత్సవం.
కరపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.
అనకాపల్లి, నవంబర్ 29, మేజర్ న్యూస్: స్థానిక చిన్నరాజుపేటలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి సాంబశివ దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస నాలుగవ సోమవారం నిర్వహించే "శూలముల మహోత్సవము" ఈ సంవత్సరం భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని తెలియజేసే కరపత్రాన్ని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అనకాపల్లిలో ప్రత్యేకంగా నిర్వహించే "శూలముల మహోత్సవము" ఎంతో భక్తి శ్రద్ధలతో, పవిత్ర భావంతో నిర్వహించబడుతూ ఎంతో ఘనంగా జరగడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అనకాపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి వరప్రసాద్, కార్యదర్శి మానం సతీష్, కోశాధికారి బాసిన బాల గురూజీ, వేమన సంతోష్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు