చెప్పింది చేసే ప్రభుత్వం మాది.. హామీలన్నీ అమలు చేస్తున్నాం
నెల్లూరు, మేజర్ న్యూస్ :
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. నెల్లూరు నగరంలోని ఏ డివిజన్‌కు వెళ్లినా గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నెల్లూరు సిటీ 70వ డివిజన్‌లో ఎంపీ గారు పర్యటించారు. కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి రాచగిరి చంద్ర తరఫున ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తోందని తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రతి వీధిలోనూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
70వ డివిజన్‌లో పర్యటించిన సమయంలో స్థానికులు కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని ఎంపీ గారు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు సైకిల్ గుర్తుకే ఓటు వేస్తామని చెబుతుండటం ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.