బుసాయవలస. జడ్పీహెచ్ఎస్ స్కూల్అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ
రామభద్రపురం, సూర్య : అంగనవాడి కేంద్రాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న హలో పథకాలపై అంగనవాడి కార్యకర్తలకు పోషణభి_ పద్ధతి బి రౌండ్ 2 పైన శిక్షణ తరగతులను నిర్వహించారు. సోమవారం స్థానిక బూసాయా వలస జడ్పీ హైస్కూల్లో ఆవరణలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి బాడంగి ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్. సుజాత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ్ బి.. పద్ధతి డి రౌండ్ 2 శిక్షణ కార్యక్రమాన్ని కార్యకర్తలు సద్విని చేసుకోవాలన్నారు. 0. 5 సంవత్సరాల లోపు గల పిల్లలకు పోషణతోపాటు విద్య తొలి దశ వికాసం 0-3 వయసు గల పిల్లలకు నవచేతన క్యాలెండర్ ఆధారంగా పిల్లల్లో ప్రారంభ బాల్య ఉద్దీపన మరియు ఇంట్లో లభించే సాధారణ వస్తువులతో మెదడు వికాసానికి అవసరమైన ఆచరణాత్మక బోధన పద్ధతులను రిసోర్స్ పర్సనల్ అందిస్తారని తెలిపారు. అలాగే ఆట ఆధారిత బాల్య విద్య (3-6) గల పిల్లలకు ఆదర్శిల పాఠ్యాంశాల ద్వారా అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో ఆనందదాయకమైన ప్రీస్కూల్ విద్యను అందించాలన్నారు. దివ్యాంగ పిల్లలు గుర్తింపు వైకల్య స్క్రీనింగ్ షెడ్యూలు ద్వారా పిల్లల్లో ఎదుగుదల ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి ఆర్బిఎస్కే వైద్య బృందాలకు రిఫర్ చేయడం వంటి అంశాల పైన రీసెర్చ్ పర్సనల్ ఇచ్చిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణ తరగతులలో సూపర్వైజర్ కృష్ణకుమారి రత్నకుమారి సూర్య కుమారి అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.