BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

బిన్‌ బ్యాగ్‌లతో చెత్త విభజనకు శ్రీకారం ఇంటింటా పారిశుధ్యంపై అవగాహన వల్లూరు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్..

Select Suryaa Now
బిన్‌ బ్యాగ్‌లతో చెత్త విభజనకు శ్రీకారం  ఇంటింటా పారిశుధ్యంపై అవగాహన  వల్లూరు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్..

బిన్‌ బ్యాగ్‌లతో చెత్త విభజనకు శ్రీకారం

ఇంటింటా పారిశుధ్యంపై అవగాహన

వల్లూరు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్..

వల్లూరు మేజర్ న్యూస్

మండల పరిధిలోని దిగువపల్లి గ్రామపంచాయతీ మైసూరారెడ్డి కాలనీలో బిన్‌ బ్యాగ్‌ల వినియోగం, చెత్త విభజన, పారిశుధ్య నిర్వహణపై అధికారులు ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శితో కలిసి వల్లూరు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ ప్రతి ఇంటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా గుర్తించి సక్రమంగా విభజించే విధానంపై ప్రజలకు వివరించారు. ఇంటి వద్దే చెత్తను తడి, పొడిగా వేరు చేసి బిన్‌ బ్యాగ్‌లలో ఉంచి, పారిశుధ్య సిబ్బందికి అందించడం వల్ల పరిసరాల పరిశుభ్రతతో పాటు చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రతి కుటుంబం తమ ఇంటి నుంచే చెత్త విభజనను పాటించి, బిన్‌ బ్యాగ్‌లను సక్రమంగా వినియోగించాలని  సూచించారు. ప్రజల సహకారంతోనే గ్రామంలో మెరుగైన పారిశుధ్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..