బిజెపి సేవా సంకల్ప అభియాన్ పై అధికారుల నిర్లక్ష్యం తగదు భాజపా నేత తాటికొండ సుధాకర్
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ విమర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాల సమాచారాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందించకపోవడం సరికాదన్నారు.చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, కామవరపుకోటలో నిర్వహించిన ముగింపు సభకు, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సైకిల్ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సమన్వయ లోపాన్ని సరిచేయాలని, లేకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పీసుపాటి వెంకట రామలక్ష్మి, వేమూరి శ్రీనివాసు, సీనియర్ నాయకుడు మల్లాది సీతారామారావు, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు కొంచాడ దుర్గ వరప్రసాద్ పాల్గొన్నారు.
రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,