బెంగళూరులో ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు ఘన స్వాగతం - పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా ఆహ్వానించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
బెంగళూరు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణరాజుకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సాదర స్వాగతం పలికారు.సోమవారం ఉదయం బెంగళూరులో డిప్యూటీ స్పీకర్ కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్ మోహన్ డిప్యూటీ స్పీకర్ తో కాసేపు ముచ్చటించారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ ను శాలువాతో సత్కరించి డిప్యూటీ స్పీకర్ అభినందించారు. చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఇరువురు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై డిప్యూటీ స్పీకర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి నాయకులంతా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్