బస్టాండ్ అవుట్ గేట్ వద్ద దెబ్బతిన్న డ్రైనేజీ... ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి బస్టాండ్ అవుట్ గేట్ వద్ద ఉన్న డ్రైనేజీ స్లాబ్ మరమ్మతులు చేపట్టిన కొద్ది రోజులకే మళ్లీ తీవ్రంగా దెబ్బతినింది. నామ్ రహదారికి అనుసంధానంగా ఉన్న ఈ డ్రైనేజీ మార్గంలో అక్కడక్కడ స్లాబ్‌లు పగిలిపోయి ప్రమాదకరంగా రంధ్రాలు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారి మరియు బస్టాండ్ అవుట్ గేట్ సమీపంలోనే ఈ డ్రైనేజీ రంధ్రాలు సమస్య కారణంగా రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేక, వాహనదారులు మరియు ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. రద్దీ వేళల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నాసిరకం పనులకు తావులేకుండా నామ్ రోడ్డు డ్రైనేజీ స్లాబ్‌లకు తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.