BREAKING
వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..... సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ. విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి గేమింగ్ కంపెనీలపై యూయూ మద్దతుతో దర్యాప్తునకు దిగిన ఇటలీ దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు! చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్ ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

బాలల విద్య.. మహిళల హక్కులపై అవగాహన ర్యాలీ

Select Suryaa Now
బాలల విద్య.. మహిళల హక్కులపై అవగాహన ర్యాలీ

కనిగిరి ,మేజర్ న్యూస్ :

సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  బాలల విద్య,లింగ సమానత్వం,వరకట్న వేధింపుల నివారణ,మహిళా సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కనిగిరిలో గురువారం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి బి. రూపశ్రీ నేతృత్వంలో కనిగిరి కోర్టు నుంచి పామూరు బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి బి. రూపశ్రీ మాట్లాడుతూ బాలబాలికలకు సమానంగా విద్య,అవకాశాలు కల్పించడంతో పాటు మహిళల హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.వరకట్న వేధింపులు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా సమాజం సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.చట్టపరమైన సమస్యలు ఎదురైన వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు,న్యాయవాదుల గుమస్తాలు,విద్యాశాఖ,ఐసీడీఎస్ అధికారులు,పోలీసు సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు,పారా లీగల్ వాలంటీర్లు,గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు,కోర్టు సిబ్బంది,న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.