BREAKING
నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్త ఎరువులు పంపిణీ విధానం పై శిక్షణ. దసరా సెలవుల అనంతరం బకాయిలు చెల్లించకపోతే హాస్టల్ నిర్వహణ కష్టమే భూగోళ పరిరక్షణే మానవాళికి అసలైన మనుగడ

పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ.

Select Suryaa Now
పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ.

సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ రూపు   డీఎస్‌ఆర్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, తల్లిదండ్రులతో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ అన్నారు.  మూలాపేటలోని డీఎస్‌ఆర్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో గురువారం ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులతో మంత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.  డీఎస్‌ఆర్‌ కన్స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించిన పాఠశాలను పరిశీలించిన తల్లిదండ్రులు పాఠశాల రూపురేఖలు పూర్తిగా మార్చిన మంత్రి నారాయణ, డీఎస్‌ఆర్‌ కన్స్ట్రక్షన్స్‌ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యా కమిటీ సభ్యులను మంత్రి సత్కరించారు. తన కుమార్తె పొంగూరు షరణితో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తాను తాటాకు గుడిసెలో పుట్టి కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నానని  తెలిపారు. పైసా పెట్టుబడి లేకుండా గుడిసెలో ఐదుగురు విద్యార్థులతో ట్యూషన్‌ చెప్పడం ప్రారంభించానని, అంచెలంచెలుగా ఎదిగి నారాయణ విద్యాసంస్థలను 30 రాష్ట్రాలకు విస్తరించానని చెప్పారు. తాను పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలన్న సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.పేదరిక నిర్మూలనలో తన వంతు కృషి చేస్తూనే నెల్లూరును అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. పేదల కోసం పక్కా ప్రణాళికతో పనిచేస్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తూ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య  :  పొంగూరు షరణి మాట్లాడుతూ నెల్లూరులో విద్యావిప్లవానికి తన తండ్రి నారాయణ శ్రీకారం చుట్టారని అన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నారాయణ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, లక్షల రూపాయల విలువైన కార్పొరేట్‌ స్థాయి విద్యా వాతావరణాన్ని పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు, ఎంఈఓ తిరుపాల్‌, ఐసీడీఎస్‌ పీడీ శైలజ, నగరపాలక సంస్థ ఎస్ఈ రహమత్ జాని, ఈఈలు చంద్రయ్య, అనిల్ కుమార్, టిపిఆర్ఓ వాసు బాబు, హెల్త్ ఆఫీసర్ దినేష్, పబ్లిక్ హెల్త్ ఈఈగిరిధర్, డిఈ జానకి రామ్, డీఎస్‌ఆర్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ రేష్మా, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, డీఎస్‌ఆర్‌ కన్స్ట్రక్షన్స్‌ ప్రతినిధి అనీల్‌, నగర పాలక సంస్థ ఏఈ నరేంద్ర, శానిటరి అధికారులు, డివిజన్‌ టీడీపీ నాయకులు మనోహర్,గండవరపు నాని, అన్నంగి ప్రసాద్‌, విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.