BREAKING
బండి సంజయ్ భవానీ దీక్ష కోకో మొక్కల ఎదుగుదలపై అవగాహన సామంతపూడి పాఠశాలలో ముందస్తు దసరా వేడుకలు. ఎమ్మెల్యే అమిలినేని ఘనంగా సత్కరించిన ప్రైవేట్ పాఠశాలల సంఘం. శాస్త్రవేత్తలు జాబితాలో అంతర్జాతీయ ఖ్యాతి న్యూజిలాండ్‌ ఉద్యోగం పేరుతో రూ.7.50 లక్షలు స్వాహా… బీజేపీ ఆధ్వర్యంలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమం ఉషశ్రీ శతజయంతికి సహకరిస్తాం డాక్టర్ జంధ్యాల, ఎం.సి. దాస్ తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాసేవలో ముందుంటుంది వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు పెద్దల పండుగకు హిందూ స్మశాన వాటికలో ప్రత్యేక శుభ్రత 25 మంది సిబ్బందితో మూడు రోజులుగా పారిశుద్ధ్య పనులు అంగన్వాడీ కార్యకర్తలకు బిజెపి మహిళ మోర్చా సన్మానం పూల సింగిడి.. బతుకమ్మ సందడి!

రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు..

Select Suryaa Now
రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు..

నెల్లిమర్ల, సూర్య : ​ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ రామస్వామి వారి దేవాలయంలో కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పలు ధార్మిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
​ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ రామచంద్రస్వామి వారికి ప్రాతఃకాలార్చన, బాలభాగం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరించిన పవిత్రములను శాస్త్రోక్తంగా విసర్జించి, యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు.
​అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో శ్రీ రామచంద్రస్వామి వారికి అత్యంత కనులపండువగా కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ సహాయ కమిషనర్ వై. శ్రీనివాసరావు, 40 మంది రుత్వికులు ఆలయ సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

 

రిపోర్టర్ : రాజారావు, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా.