BREAKING
పాఠశాలకు కంప్యూటర్ అందజేత జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సందీప్ కుమార్ గోల్డ్‌మన్ శాక్స్ అగ్రశ్రేణి అధికారులకు భారీగా 500 మిలియన్ డాలర్ల స్పెషల్ బోనస్! నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు!

Select Suryaa Now
కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు!

కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు!

కనీసం 15 రోజులైనా రైతులకు 12 గంటల విద్యుత్‌ ఇవ్వాలి.

పంటలు పండితేనే రైతన్నకు మేలు..

స్థానిక ఎమ్మెల్యే, అధికారులు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం.

మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మాదేవేందర్ రెడ్డి.

రామాయంపేట : కరెంట్‌ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడేందుకు కనీసం 15 రోజుల పాటు రోజుకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.రైతులకు సాగునీరు, విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ నిజాంపేట మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట బిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు బిఆర్‌ఎస్‌ నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలు కీలకమైన పొట్ట దశలో ఉన్నాయని, ఈ సమయంలో సాగునీరు అందితేనే పంటలు చేతికొచ్చి రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. కనీసం మరో 15 రోజుల పాటు రోజుకు 12 గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తే రైతుల పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని  హామీ ఇచ్చిందని, కానీ ప్రస్తుతం రైతులకు కనీసం ఆరు నుంచి ఏడు గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా అందడం లేదని  ఆరోపించారు. విద్యుత్‌ సరఫరాలో లో-వోల్టేజీ, ట్రిప్పింగ్‌ సమస్యల కారణంగా రైతుల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.“రైతులకు విద్యుత్‌ సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటే రైతుల సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపైఉందన్నారు.నియోజకవర్గంలోని రైతుల పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా ఇతర విషయాలపై దృష్టి పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు.మెదక్‌ నియోజకవర్గ రైతులు మీకు ఓటేయలేదా? ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించేందుకే కదా?” అంటూ ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌, సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.రైతుల పంటలను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి. విక్రమార్క గారు,అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, కనీసం 15 రోజుల పాటు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని  కోరారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే రైతుల పక్షాన మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అందే కొండల్ రెడ్డి మజీ ఎంపీటీసీ బాల్ రెడ్డి వెంకటస్వామి అబ్దుల్ అజీజ్ వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ రంజిత్ గౌడ్ నయిని లక్ష్మణ్ మావురం రాజు తో పాటు నాయకులు తదితరులు ఉన్నారు