సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు
తలకొండపల్లి మండల రెవిన్యూ అధికారులు10-30 గంటలకు విధులకు రావాల్సి ఉన్నప్పటికీ ఇస్తానుసారంగా కార్యాలయానికి వస్తున్నారని రైతు సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల వెంకటయ్య ఆరోపించారు. గురువారం రోజు తలకొండపల్లి రెవెన్యూ అధికారులు 11-00 గంటలైన కార్యాలయానికి రాకపోవడంతో పనుల నిమిత్తం వచ్చిన బాధితులు పడిగాపులు కాయవలసి వస్తుందని ఆయన తెలిపారు. 11 గంటలకు కార్యాలయానికి వచ్చిన తహసిల్దార్ రమేష్ ను రైతు సంఘం నాయకుడు వెంకటయ్య ఆఫీసు సమయపాలన ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించగా మా ఇష్టం వచ్చిన టైంకు వస్తాం నీవు ఎవరు అడగడానికి రాత్రి 8:30 గంటల వరకు ఆఫీసులో ఉంటున్నామని, నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో అని లేదా ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించు అని ఆవేశంతో సమాధానము ఇచ్చినట్లు వెంకటయ్య తెలిపారు. సమయపాలన పాటించాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ తలకొండపల్లి రెవెన్యూ సిబ్బంది11 గంటలైన కార్యాలయనికి రాకపోవడంతో కాలి కుర్చీలు తహసిల్దార్ కార్యాలయంలో దర్శనమిస్తున్నాయని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు తలకొండపల్లి మండల రెవెన్యూ కార్యాలయనన్ని పర్యవేక్షించి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్ : తలకొండపల్లి.