BREAKING
నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్త ఎరువులు పంపిణీ విధానం పై శిక్షణ. దసరా సెలవుల అనంతరం బకాయిలు చెల్లించకపోతే హాస్టల్ నిర్వహణ కష్టమే భూగోళ పరిరక్షణే మానవాళికి అసలైన మనుగడ

డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం

Select Suryaa Now
డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం

డ్రగ్స్ కు దూరంగా ఉండండి-ఆరోగ్యం కాపాడుకోండి   విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించిన ఈగల్ సెల్, పి.ఎం.పి అసోసియేషన్   పఠాన్ గౌస్ బాషా,   టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :  భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు  వికసిత్ భారత్ లక్ష్య సాదనలో భాగంగా దేశ యువతను మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడకుండా రక్షించేందుకు ఈగల్ సెల్ మరియు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా), నెల్లూరు జిల్లా, కావలి డివిజన్ అధ్యక్షులు పీవీ. రమణయ్య ఆధ్వర్యంలో గురువారం నాడు డా. లక్ష్మీ కృష్ణారావు విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి. గౌస్ బాషా పాల్గొని మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు డ్రగ్స్, (మాదకద్రవ్యాలు) కు అలవాటుపడి యువత చెడుమార్గంలో వెళ్ళకుండా ఉండేందుకు ఈగల్ సెల్ మరియు పీఎంపీలు అవగాహన కల్పించడం ఎంతో అభినందనీయమని, మత్తుతో స్నేహం చేసేవారు ఒంటరై సమాజంలో ఒక్కడిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగంవల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామీణ వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

డ్రగ్స్ వద్దు-ఆరోగ్యమే ముద్దు  :  ప్రముఖ న్యాయవాది పొట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ.... పీఎంపీలు ప్రాథమిక వైద్యసేవలకే పరిమితం కాకుండా సమాజసేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారని, డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దుఅని విద్యార్థులకు, యువకులకు, అవగాహన కల్పించడంలో ముందుంటున్నారని కొనియాడారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ... విద్యార్థి దశలో తీసుకొనే చిన్న నిర్ణయాలు భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతాయని, సరదాగా ఒకసారి ప్రయత్నిద్దాంఅనే ఆలోచనతో మొదలయ్యే అలవాటు క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు చదువు, ఆలోచన శక్తి, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ అధికారి పటాన్ ఫిరోజ్, పి. రాంబాబు, జిల్లా పీఎంపీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, పివి.రమణయ్య, స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు ఖాదర్ భాష, పాఠశాల హెచ్ఎం ఎండి. చౌదరి, లోక్ అదాలత్ సభ్యులు మాలకొండ రెడ్డి, మీకోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్, హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు గని భాష, రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి.ప్రసాద్ రావు, ఓట్టూరు మస్తానయ్య, మొగిలి దయాకర్ రావు, డివి. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.