BREAKING
ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్త ఎరువులు పంపిణీ విధానం పై శిక్షణ. దసరా సెలవుల అనంతరం బకాయిలు చెల్లించకపోతే హాస్టల్ నిర్వహణ కష్టమే భూగోళ పరిరక్షణే మానవాళికి అసలైన మనుగడ కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జీవించినంత కాలం ప్రతి ఒక్కరు కంటిచూపూను కలిగి ఉండాలి.. జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి.సుప్రియ..*

కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు

Select Suryaa Now
కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు

 

రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం: జైపాల్ యాదవ్

కడ్తాల్: 

కల్వకుర్తి నియోజకవర్గంలోని ముద్విన్ గ్రామంలో విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలను మాజీ ఎమ్మెల్యే, కల్వకుర్తి బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ జైపాల్ యాదవ్ గురువారం పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో పంటలకు సకాలంలో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.రైతుల సమస్యలను విన్న జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యుత్ కోతలు, పంట నష్టానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతామని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.