BREAKING
పాఠశాలకు కంప్యూటర్ అందజేత జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సందీప్ కుమార్ గోల్డ్‌మన్ శాక్స్ అగ్రశ్రేణి అధికారులకు భారీగా 500 మిలియన్ డాలర్ల స్పెషల్ బోనస్! నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి

Select Suryaa Now
విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి

 

పడకల్, లింగరావుపల్లి, రామకృష్ణపురం, దేవునిపడకల్, పెద్దూర్ తండా, వెంకటాపూర్ తండా  గ్రామపంచాయతీలకు సంబంధించిన పడకల్ విద్యుత్తు ఉప కేంద్రానికి ఆల్వాల్ 132 కేవీ విద్యుత్తు కేంద్రం నుంచి సరఫరా అవుతుందని, లోడు ఎక్కువ కావడంతో తరచుగా ట్రిఫ్ అవుతుందని దీంతో సక్రమంగా విద్యుత్తు సరఫరా కావడం లేదని తలకొండపల్లి సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి విన్నవించారు. చేతికొచ్చిన వరి పంటలు ఎండు తున్నాయని, రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పడకల్ సబ్ స్టేషన్ కు ఆల్వాల్ నుంచి వచ్చే ఫిడర్ కు లోడు తగ్గించాలని కోరారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని ఎమ్మెల్యేని కోరారు. అదేవిధంగా సీసీఐ నుంచి పత్తి కొనుగోళ్ల ను ప్రారంభించాలని మొదట పత్తి తీస్తున్న రైతులు దసరా ఖర్చుల కోసం సీసీఐ లేకపోవడంతో తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని వివరించారు. సీసీఐ కొనుగోలును త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యేకు కేశవ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా ముదిరాజ్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కాకి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్: తలకొండపల్లి.