ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.....
సూర్య బెజ్జుర్ :అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామల తిరుపతి, తంగడిపల్లి నీలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ బెజ్జూర్ మండల కన్వీనర్ విశ్వనాథ్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ రాజకొండ అంజన్న, కో-కన్వీనర్ కంబాల అన్వేష్, హాస్టల్స్ కన్వీనర్ లెక్కల కార్తీక్ , కార్తీక్ ఎదునూరి అంజన్, నీకది శ్రీకాంత్, హర్షిత్ ఏబీవీపీ నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.బతుకమ్మ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.