BREAKING
పాఠశాలకు కంప్యూటర్ అందజేత జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సందీప్ కుమార్ గోల్డ్‌మన్ శాక్స్ అగ్రశ్రేణి అధికారులకు భారీగా 500 మిలియన్ డాలర్ల స్పెషల్ బోనస్! నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్

Select Suryaa Now
చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి  టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్

ఎంత సీనియర్ నేతలైనా టిడిపి లైన్‌కు కట్టుబడి పని చేయాల్సిందేనని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శిక్షణాతరగతుల ట్రైనర్లతో లోకేష్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,300మంది క్లస్టర్, బూత్ ఇన్చార్జిలకు శిక్షణా తరగతులు పూర్తి చేశామని, 50వేలమందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులకు శిక్షణా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అన్న పార్టీ మూల సిద్ధాంతానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 45రోజుల్లో 1.13 కోట్ల ఇళ్లను నాయకులు సందర్శించారని చెప్పారు. పార్టీకంటే ఎవరూ గొప్పవారు కాదని, ఏదైనా అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.

పార్టీలో కేవలం పెర్ఫార్మెన్స్ ఆధారంగానే నాయకులకు గుర్తింపునిస్తామని, ఈ విషయంలో ఎటువంటి సిఫారసులు, పైరవీలకు తావీయబోమని స్పష్టంచేశారు. పార్టీ కార్యక్రమాలను మరింత వేగంగా, సులభంగా గ్రాస్ రూట్ స్థాయి కేడర్ కు తీసుకెళ్లేందుకు ఎఐని వినియోగిస్తున్నామని, అధునాతన టెక్నాలజీపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శిక్షణా తరగతులకు వచ్చే నాయకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం, అందరూ ఆర్థికంగా బలోపేతమై సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్నది పార్టీ అధినేత అంతరంగమని తెలిపారు.

కేంద్రంలో బిజెపి వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడానికి ఆ పార్టీ కేడర్ కమిట్ మెంట్ ప్రధాన కారణమని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యం కాదని, వివిధ కారణాల వల్ల తొలిదశలో అవకాశాలు రానివారికి మలివిడతలో అవకాశం కల్పిస్తామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న పలువురు సీనియర్ నాయకుల అనుభవాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మానవ వనరుల విభాగం కోఆర్డినేటర్ వేపాడ చిరంజీవి, ఎంపి చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా శిక్షణాతరగతులు నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నాయకులకు మంత్రి లోకేష్ ప్రశంసాపత్రాలు అందజేశారు.