పవన్ కల్యాణ్ పోలవరం పర్యటన మరోసారి వాయిదా: ఈ నెల 12న సందర్శన
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం పర్యటన మరోసారి వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఈ పర్యటనను ఈ నెల 12వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన పోలవరం ప్రాంతంలో పర్యటించి, కాకవాడ, రాకోట గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించి ప్రాజెక్ట్ పనులను, స్థానిక సమస్యలను పరిశీలించనున్నారు.