BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం

బాలల రక్షణే అందరి బాధ్యత - పోక్సో చట్టంపై అవగాహన సదస్సు

Select Suryaa Now
బాలల రక్షణే అందరి బాధ్యత  - పోక్సో చట్టంపై అవగాహన సదస్సు

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
పోక్సో చట్టం - 2012పై దేశవ్యాప్త పాఠశాల స్థాయి అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బీవీ రెడ్డి పాఠశాల నందు సోమవారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పద్మజ ప్రసంగిస్తూ పిల్లలు చెడుగా ప్రవర్తించే వారి పట్ల వద్దు అని చెప్పాలన్నారు. బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం అనే లక్ష్యంతో సురక్షిత బాల్యం - బాలల రక్షణ ఉద్యమం పేరుతో పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టంపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలలపై జరిగే లైంగిక వేధింపుల స్వరూపం, వాటిని గుర్తించే విధానం, బాలల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధిత బాలలకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన రక్షణలు, ఫిర్యాదు చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రతి బాలుడు, బాలిక తమ హక్కుల గురించి తెలుసుకోవడం, మంచి స్పర్శ - చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, ఏదైనా వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని తెలియజేశారు. పోక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, బాలలపై జరిగే నేరాలను ఉపేక్షించకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బాలల భద్రత మనందరి బాధ్యత - ప్రతి బాల్యాన్ని సురక్షితంగా కాపాడుదామని అన్నారు. ఈ సదస్సులో మండల విద్యాశాఖాధికారి మోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య, పాఠశాల నిర్వాహకురాలు వనసుందరి పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్