BREAKING
14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ కె. గంగవరం పంచాయతీ పీఠం నాగేశ్వరరావుకే..! ఢిల్లీ యమునా రివర్ క్రూయిజ్: బుకింగ్ & రూట్ వివరాలు నగర అభివృద్ధికి అండగా ఉంటాం విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టిన 3D ప్రాజెక్టుల ప్రదర్శన క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం బడ్జెట్ 2027: పీహెచ్‌డీసీసీఐ 5 ప్రధాన డిమాండ్లు వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు జీవో నెం.15ను అమలు చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి - అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు దేశపాలెంలో వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలు శ్రీరామ్ చిన్నబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు రఫా సరిహద్దులో లూయిస్ హామిల్టన్: గాజా సహాయక పరిశీలన టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరపాలి ప్రత్యేక ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింతైన ఔట్.. అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా వెనుదిరిగిన కెప్టెన్!

బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలి విద్యార్థులకు న్యాయవ్యవస్థపై అవగాహన అవసరం: జడ్జి హిమబిందు

Select Suryaa Now
బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలి  విద్యార్థులకు న్యాయవ్యవస్థపై అవగాహన అవసరం: జడ్జి హిమబిందు

వత్సవాయి: మగపిల్లలతోపాటు ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని జగ్గయ్యపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హిమబిందు అన్నారు. వత్సవాయి మండలం భీమవరం గ్రామ పరిధిలోని శ్రీ తక్షశిల పాఠశాలలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయం అందరికీ హక్కు, న్యాయం అందరికీ సమానం అనే నినాదంతో విద్యార్థులకు న్యాయవ్యవస్థ, చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో నేరాలు, ఘోరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. బాలికలపై వేధింపులకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలపై ఎలాంటి వివక్ష చూపకూడదని, ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు.విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధురి, న్యాయవాదులు దాసరి నాగేశ్వరరావు, మెట్టెల ఆంజనేయులు, డీవీ కృష్ణగాంధీ, పారాలీగల్ వాలంటీర్ మన్నేపల్లి మురళి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధి అనూష తదితరులు పాల్గొన్నారు.