బాల త్రిపుర సుందరి దేవిగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు.
పాతపట్నం ఉత్కలాంధ్రుల ఆరాధ్యదైవం పాతపట్నంలో వెలసియున్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలి రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రుల పర్వదినం పురస్కరించుకుని పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు.