అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానానికి ఆర్థిక సాయం - సెశెట్టి సోమరాజు, మోహన్
ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ, 17వ వార్డు పరిధిలో గల సంజయ్ గాంధీ కాలనీ శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం వద్ద నిర్వహిస్తున్న నిత్యా అన్నదాన కార్యక్రమానికి 17 వ వార్డు, విజయ దుర్గా కాలనీకి చెందిన సెశెట్టి సోమరాజు, మోహన్ వారి పేర్ల మీద ఒక్కరోజు అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సాయం అందజేశారు. స్వాములకు అన్నదాన ప్రసాదాన్ని సోమరాజు, మోహన్ చేతుల మీదుగా వడ్డించే అవకాశాన్ని కల్పించారు. ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం ప్రతినిధులు, గురు స్వాములు ఎం. సీతారాం, కోడి బోయిన అప్పలరాజు, బోనీ దిలీప్ కుమార్ ను పలువురు అభినందిస్తున్నారు. వచ్చేనెల 10 వ తేదీ వరకు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. స్వామిలందరూ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి, తమ వంతు సహాయ సహకారాలు అందించి, స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.