BREAKING
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు. 2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు... మైత్రి లేఔట్ లో రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం వైయస్ మనోహర్ రెడ్డి

అవనిగడ్డ రెడ్ క్రాస్ ను అభినందించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
అవనిగడ్డ రెడ్ క్రాస్ ను అభినందించిన ఎమ్మెల్యే
అవనిగడ్డ రెడ్‌క్రాస్ ను అభినందించిన ఎమ్మెల్యే మండలి
 
అవనిగడ్డ,మేజర్ న్యూస్: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర–2026లో కృష్ణా జిల్లా స్థాయి అవార్డు అందుకున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అవనిగడ్డ ఉపశాఖ సభ్యులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందించి సత్కరించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యుల సేవలను ప్రశంసించారు.
రెడ్‌క్రాస్ అవనిగడ్డ శాఖ చైర్మన్ గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో సభ్యులు గుర్రపు చెరువు అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని బుద్ధప్రసాద్ అన్నారు. జిల్లాలో అవనిగడ్డ రెడ్‌క్రాస్ శాఖ సేవలకు గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. అవనిగడ్డలోని ఏకైక పార్కు తంగిరాల వీరారాఘవయ్య పార్కును అభివృద్ధి చేసి, బృందావనంలా తీర్చిదిద్దేందుకు సభ్యులు సహకరించాలని సూచించారు.
రెడ్‌క్రాస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని సభ్యులు కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దారుకు సిఫార్సు చేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఉపశాఖ వైస్ చైర్మన్ గరికిపాటి హరిప్రసాద్, కోశాధికారి అల్లంశెట్టి వెంకటేశ్వరరావు, సభ్యులు తుంగల వెంకటగిరి, ఆది రామమోహనరావు, కోడూరు శ్రీనివాసరావు, కొమ్మినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.